కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ


Fri,November 1, 2019 11:49 PM

అన్నపురెడ్డిపల్లి: కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో గ్రామాలకు మహర్దశ పట్టిందని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య స్పష్టం చేశారు. అన్నపురెడ్డిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సున్నం లలిత అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అన్నిశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కోరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. 30 రోజుల ప్రణాళికతో గ్రామాలు ప్రగతి బాట పట్టాయని, ఇది నిరంతర ప్రక్రియ అని, గ్రామాలను పరిశుభ్రత, పచ్చదనంతో ప్రజాప్రతినిదులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పల్లెలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి, పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మంజూరు చేసిందన్నారు.


ప్రతీ పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. కేసీఆర్ ఆశయాల కు అనుగుణంగా గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేయటానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భారత లాలమ్మ, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ బోయినపల్లి సుధాకర్‌రావు, కొత్తగూడెం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సన్నేపల్లి నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ మామిళ్లపల్లి రామారావు, ఎంపీటీసీలు అయిలూరి కృష్ణారెడ్డి, కాకా సీత, ఎంపీడీవో రేవతి, తహసీల్దార్ జగదీశ్వర్, సర్పంచ్‌లు సడియం తిరుపతయ్య, బోడా పద్మ, సవలం రాణి, ఉపసర్పంచ్‌లు పర్సా వెంకటేశ్వరరావు, మామిళ్లపల్లి లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు బండి రఘుపతిరెడ్డి, తాటి వీరభద్రం, జంగాల ఉమామహేశ్వరరావు, కొ త్తూరి వెంకటేశ్వరరావు, భూపతి నరసింహరావు, వీరబోయిన వెంకటేశ్వర్లు, అప్పారావు, అచ్చన రామకృష్ణ,రాంబాబు, సత్యనారాయణ, రాఘవులు, సత్యం పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles