వైరా ఐఎంఎల్ డిపోలో రూ.11కోట్ల మద్యం అమ్మకాలు


Fri,November 1, 2019 11:49 PM

వైరా, నమస్తే తెలంగాణ: నూతన మద్యం షాపులు ప్రారంభమైన సందర్భంగా గురువారం రాత్రి, శుక్రవారం వైరాలోని ఐఎంఎల్ డిపోలో రూ.11కోట్ల మద్యాన్ని విక్రయించారు. డిపో నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైన్ షాపులకు, బార్‌లకు మద్యం సరఫరా చేస్తున్నారు. షాపులు దక్కించుకున్న లైసెన్స్‌దారులు శుక్రవారం మద్యం షాపులు ప్రారంభించేందుకు అవసరమైన మద్యం కోసం వైరాలోని ఐఎంఎల్ డిపోకు వచ్చారు. లైసెన్స్‌దారులకు స్వాగతం పలుకుతూ పలు మద్యం కంపెనీలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఒక్కరోజే 20వేల లిక్కర్ కేసులు, 14వేల బీరు కేసులను ఐఎంఎల్ డిపోలో విక్రయించారు. సాధారణంగా వైరా ఐఎంఎల్ డిపోలో రోజుకు సగటున రూ.4కోట్ల మద్యాన్ని లైసెన్స్‌దారులకు విక్రయిస్తారు. షాపులు ప్రారంభం రోజు కావడంతో శుక్రవారం ఏకంగా రూ.11కోట్ల మద్యాన్ని లైసెన్స్‌దారులు కొనుగోలు చేశారు. లైసెన్స్‌దారులు షాపులను ప్రారంభించే మొదటి రోజు కావడంతో ఐఎంఎల్ డిపో అధికారులు శుక్రవారం రాత్రి 9గంటల వరకు తమ విధులు నిర్వహించారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles