భద్రాద్రిలో నేటినుంచి క్రీడా సందడి


Fri,November 1, 2019 11:48 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ : భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి అండర్-17 బాలుర వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం మైదానంలో రెండు ప్రత్యేక వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఫ్లడ్‌లైట్ వెళుతూరులో ఈ పోటీల నిర్వహణ జరగనుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 120 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారు. 30 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పోటీల నిర్వహణకు సహకరించనున్నారు. ఫ్లడ్‌లైట్ల వెళుతూరులో సాయంత్రం3 నుంచి రాత్రి 10గంటల వరకు ఈ పోటీలు జరగనున్నాయి. క్రీడల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు ఇప్పటికే భద్రాచలం చేరుకున్నారు. క్రీడా పోటీలు అనంతరం తెలంగాణ అండర్17 బాలుర జట్టును ఎంపిక చేస్తారని క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ బోళ్ల వెంకటేశ్వర్లు నమస్తే తెలంగాణకు తెలిపారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles