స్వరూపానందేంద్ర స్వామికిగాయత్రి రవి సత్కారం


Fri,November 1, 2019 12:50 AM

-పీఠాధిపతికి సత్కారం
విశాఖ శ్రీశారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం సందర్భంగా గురువారం ఖమ్మం జిల్లాకు చెందిన గాయత్రి రవి విశాఖపట్నంలో పీఠాధిపతిని ఘనంగా సత్కరించారు.. జ్ఞాపిక అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు..ఖమ్మం, నమస్తే తెలంగాణ: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామిని టీఆర్‌ఎస్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఘనంగా సత్కరించారు. విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠంలో స్వామి వారి జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. స్వామికి నూతన వస్ర్తాలు, పండ్లు, ఫలాలను అందించి, పూలమాలలతో సత్కరించారు. జ్ఞాపికను బహూకరించారు. గాయత్రి రవిని స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆశీర్వదించారు. వీరిద్దరి మధ్య కొద్దిసేపు ఏకాంత భేటీ జరిగింది. ఆధ్యాత్మిక, రాజకీయ, వైదిక కార్యక్రమాలపై చర్చించారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles