అభివృద్ధి బాటలో చిన్న పంచాయతీలు


Fri,November 1, 2019 12:48 AM

-జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య
చండ్రుగొండ, అక్టోబర్ 31 : తండాలను, గూడేలను పంచాయతీలుగా చేయటంతో గ్రామాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయని జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య స్పష్టం చేశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత అన్ని శాఖల అధికారులతో సమీక్షను నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మండలాన్ని అన్ని విధలా అభివృద్ధి చేయాలన్నారు. 30 రోజుల ప్రణాళికతో గ్రామాల్లో సమస్యలను పరిష్కరించుకున్నామన్నారు. శానిటేషన్ బాగుకావడంతో పాటు, ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతను తవ్వుకోవాలనే ఆలోచన ప్రజల్లో వచ్చిందన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మనమంతా కృషి చేయాలన్నారు. హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతీ మొక్కను సంరిక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు వచ్చేలా చూస్తానన్నారు.


సిమ్లాతండా, జర్పులాతండా, రామక్కబంజర గ్రామాలకు త్రిపేజ్ కరెంటు సరఫరా వచ్చేలా చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యన్నారాయణ, జడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి, ఎంపీడీఓ ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మాలోత్ బోజ్యనాయక్, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ మేడా మోహన్‌రావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు లంకా విజయలక్ష్మి, సంగోండి వెంకటకుమారి, మలిపెద్ది లక్ష్మిభవాని, పూసం వెంకటేశ్వర్లు, బానోత్ రన్య, ఇస్లావత్ నిరోషా, గుగులోత్ బాలాజీ, గుగులోత్ సునీత, కీసరి శాంతమ్మ, బొర్రా లలిత కుమారి, దారాబాబు,లక్ష్మిపతి, ధరావత్ రామారావు, నల్లమోతు వెంకటనారాయణ, సంగొండి రాఘవులు, బానోత్ రాముడు, గుగులోత్ రాములు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles