జ్వరంతో న్యాయమూర్తి జయమ్మ మృతి


Tue,October 22, 2019 02:22 AM

ఖమ్మం లీగల్, అక్టోబర్ 21; ఖమ్మం రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ న్యాయమూర్తి ముడావత్ జయమ్మ(45) గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. జయమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త హైదరాబాద్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వండ మండలం, అయోధ్యనగర్ గ్రామానికి చెందిన జయమ్మ 2013లో జడ్జిగా ఎంపికయ్యారు. జనవరి 7, 2019న ఖమ్మం రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె పెద్ద కుమారుడు రోహిత్ డాక్టర్. చిన్న కుమారుడు ఎంబీబీస్ విజయవాడలో చేస్తున్నాడు. ఖమ్మం బార్ అసోసియేషన్ సోమవారం అత్యవసర సమావేశమై న్యాయమూర్తి జయమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు. న్యాయమూర్తి జయమ్మ మృతి పట్ల ఐలు జిల్లా కమిటీ ఒక ప్రకటనలో సంతాప, సానుభూతిని తెలిపింది.


కొత్తగూడెం లీగల్ : ఖమ్మం రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ముడావత్ జయమ్మ (48) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. ఆమె మృతికి సంతాపంగా కొత్తగూడెం న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆమె ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. కొత్తగూడెం కోర్టులో జరిగిన సంతాప సభలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి జి.శ్రీనివాస్, రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ పాలాదిశిరీష, మూడవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ పి.దేవీమానస, కొత్తగూడెం బార్ ఉపాధ్యక్షుడు పి.నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, అడపాల మహాలక్ష్మీ, చావా కృష్ణకుమారి, అత్తులూరి మనోరమ, మెండు రాజమల్లు, సీనియర్ న్యాయవాదులు జే.శివరాంప్రసాద్, ఏ.రాంప్రసాదరావు, కటకం పుల్లయ్య, ఎస్.రమణారెడ్డి, తోట మల్లేశ్వరరావు, జూనియర్, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles