వైకుంఠధామ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ట్రైనీ కలెక్టర్


Tue,October 22, 2019 02:22 AM

పినపాక, అక్టోబర్ 21 : మండలంలోని పాండురంగాపురం గ్రామంలో వైకుంఠదామ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ట్రైనీ కలెక్టర్ అనుదీప్ సోమవారం పరిశీలించారు. ఈ స్థలం కొంత వివాదస్పదంగా మారడంతో స్థల విషయంలో ఫిర్యాదు చేసిన ఓ గిరిజన రైతును పిలిపించి అతని నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తన పట్టా భూమి అని తనకు తెలియకుండా ఈ భూమిని వైకుంఠదామానికి ఎలా కేటాయిస్తారని రైతు వివరించారు. సదరు రైతు వద్ద ఎంత భూమి అయితే తీసుకుంటున్నారో..అంత భూమి అతనికి ఇదే గ్రామంలో కేటాయించి పట్టా ఇవ్వాలని అధికారులను, రెవెన్యూ సిబ్బందికి ట్రైనీ కలెక్టర్ సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ట్రైనీ కలెక్టర్ గ్రామంలో డంపింగ్ యార్డుకు కూడా స్థలాన్ని కేటాయించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఈసం భవతి, డిప్యూటీ తహసీల్దార్ సమ్మయ్య, ఆర్‌ఐ వీరభద్రం, గ్రామస్తులు పాల్గొన్నారు.


ఎంపీడీవోగా ట్రైనీ కలెక్టర్ అదనపు బాధ్యతల స్వీకరణ
కరకగూడెం : పినపాక ఇన్‌చార్జ్ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ట్రైనీ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సోమవారం కరకగూడెం మండల ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎంపీడీవోగా పనిచేసిన వెంకటేశ్వర్లు సెలవులపై వెళ్లడంతో ఆ బాధ్యతలను ట్రైనీ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌కు ఉన్నతాధికారులు అప్పగించారు.

77
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles