రామాలయంలో ప్రత్యేక పూజలు..


Tue,October 22, 2019 02:22 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ : పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జామున అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి ముందుగా సుప్రభాత సేవ నిర్వహించారు. గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి అభిషేకం చేశారు. ఆరాధన, అర్చన, సేవాకాలం, నివేదన, పుణ్యఃవచనం తదితర పూజలు గావించారు. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామునికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles