రక్తదాన శిబిరంలో భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్


Mon,October 21, 2019 01:04 AM

కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 20 : పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ సునీల్ దత్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం డీఎస్పీ షేక్ మహమ్మద్ అలి ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సునీల్ దత్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రతీ ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి విలువైన ప్రాణాలను సైతం కాపాడవచ్చని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులకు ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. సంఘవిద్రోహ శక్తులను తరిమి కొట్టడంలో పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ బి. కిష్టయ్య, కొత్తగూడెం డీఎస్పీ ఎస్.ఎం అలి, వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ లావుడ్యా రాజు, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ, జూలూరుపాడు సీఐ నాగరాజు, చుంచుపల్లి సీఐ తాటిపాముల కరుణాకర్, ఎస్సైలు దురిశెట్టి వరుణ్ ప్రసాద్, మహేష్, లొడిగ రవీందర్, శ్రీనివాస్, దేశం రాఘవ, ఏకుల రతీష్, పోలీస్ పీఆర్‌వో దాములూరి శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, పట్టణ యువకులు రక్తదానం చేశారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles