భద్రాద్రి రామాలయంలో భక్తుల సందడి


Mon,October 21, 2019 01:03 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ అక్టోబర్20: భద్రాచలం రామాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థ్ధప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియాన్ని సందర్శించి సీతమ్మవారి నగలను ఆసక్తిగా తిలకించారు.


ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి ఆలయంలోని బేడా మండపంలో రామయ్యస్వామికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు రాముని విశిష్టత గురించి భక్తులకు వివరించారు. భక్తులరాకను పురస్కరించుకొని రామాలయం ప్రాంగణం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles