బస్సు అద్దం ధ్వంసం


Fri,October 18, 2019 11:30 PM

ఇల్లెందు నమస్తే తెలంగాణ: మహబూబాబాద్ డిపో బస్సు వెనుక అద్దాన్ని ఇల్లెందు బస్టాండ్‌లో శుక్రవారం అగంతకుడు పగులగొట్టాడు. పోలీసులు తెలిపిన వివరాలు... ఆర్టీసీ మహబూబాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు శుక్రవారం మధ్యాహ్నం ఇల్లెందు బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడ ఆగిన బస్సు వెనుక అదాన్ని గుర్తు తెలియని వ్యక్తి పగులగొట్టి పరారయ్యాడు. దీనిపై, ఇల్లెందు సీఐ వేణుచందర్ మాట్లాడుతూ... బస్సు అదాన్ని గుర్తు తెలియని వ్యక్తి పగులగొట్టాడు. మొహానికి కర్చీఫ్ కట్టుకుని ఇల్లెందు బస్టాండ్‌లోకి టూవీలర్‌తో ఒక వ్యక్తి వెళ్లాడు. అతడే అద్దాన్ని పగులగొట్టి ఉండవచ్చని భావిస్తున్నాం. ఆకతాయితనంతో పగులగొట్టాడా...? సమ్మె నేపథ్యంలో ఇలా చేశాడా...? అనేది తెలుసుకుంటాం. సీసీ కెమెరాలో రికాైర్డెన ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నాం. త్వరలోనే పట్టుకుంటాం అని చెప్పారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles