గంజాయి పట్టివేత


Fri,October 18, 2019 11:29 PM

బూర్గంపహాడ్: మండలంలో గంజాయి పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాలు.... నెల్లిపాక నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్జునూరు జిల్లా ముదారాబాద్ మండలం ఇలహాబాద్ గ్రామానికి చెందిన ముస్తాక్ అహ్మద్ అన్సారీ, ముస్తాఫా అనార్సీ...నెల్లిపాక నుంచి తమ గ్రామానికి గంజాయి తరలిస్తున్నారు. బూర్గంపహాడ్ మండలంలోని సందెళ్లరామాపురం గ్రామంలో తమ రాష్ర్టానికి వెళ్లేందుకు వారు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో స్థానిక ఎస్‌ఐ బొమ్మెర బాలకృష్ణ తమ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమానస్పదంగా ఈ ఇరువురు వ్యక్తులు కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌లు తనిఖీ చేయగా అందులో 4 ప్యాకెట్లలో సుమారు రూ.60వేలు విలువ చేసే 8కేజీల గంజాయి ఉన్నట్లు వివరించారు. ఇరువురి వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles