అన్నదాతలకు అండగా తెలంగాణ ప్రభుత్వం


Thu,October 17, 2019 11:44 PM

-సంక్షేమ పథకాలతో రైతులకు మేలు
-రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి


సారపాక: రాష్ట్రంలో అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖా మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం సారపాక ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, రైతును రాజు చేయాలనేది కేసీఆర్ లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఇప్పటికే రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టిందని, వాటితో పాటు పైలెట్ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని రైతులకు ఎకరాకు రూ.9వేలు అదనంగా సహాయం అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ప్రతి రైతుకు పైలెట్ ప్రాజెక్టు ద్వారా పెట్టుబడి సాయంతో పాటు అదనంగా ఎకరాకు రూ.9వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం చూస్తోందన్నారు. ఈమేరకు నూతన వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలు కార్మికులను రెచ్చగొడుతున్నాయి : మంత్రి
రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెను ఆసరా చేసుకొని ప్రతిపక్షాలు, నాయకులు కార్మికులను రెచ్చగొడుతున్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కార్మికుల పక్షాన న్యాయం జరగాలని కోరుకునే వారిలో నేను కూడా ఉన్నానని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టిన పార్టీలకు ఇతర రాష్ర్టాల్లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేశారా.. సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. వీలైనంత త్వరగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని న్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ, భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేష్‌మిశ్రాలతో పాటు వ్యవసాయశాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles