పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా


Thu,October 17, 2019 11:42 PM

-ఎంపీ నామా బాధ్యతల స్వీకరణ
ఖమ్మం, నమస్తే తెలంగాణ: లోక్‌సభలో టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును పార్లమెంటు లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా ఇటీవల లోక్‌సభ స్పీకర్ నియమించారు. పార్లమెంట్ భవనంలో ఇందుకోసం కేటాయించిన ప్రత్యేక కార్యాలయంలో గురువారం నామా నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. తొలిరోజే లైబ్రరీ జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్లు, సంబంధిత ఇతర ఉన్నతాధికారులతో నామా నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాథమికంగా లైబ్రరీ నిర్వహణకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పలువురు సభ్యులు, అధికారులు పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్ నామా నాగేశ్వరరావును కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles