హిందూ ధర్మో రక్షతి.. రక్షితః


Thu,October 17, 2019 11:42 PM

ఖమ్మం కల్చరల్: మహిమాన్వితమైన విశాఖ శ్రీశారదా పీఠం స్వామీజీలతో జిల్లా పునీతమైంది.. జిల్లాలో నాలుగు రోజులుగా శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి నిర్వహిస్తున్న హిందూ ధర్మ ప్రచార యాత్రకు విశేష స్పందన వస్తోంది. ఉత్తరాధికారితో పాటు గురువారం శారదా పీఠం పీఠాధికారి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి కూడా వేంచేయడంతో జిల్లా హైందవ ధర్మంతో ఉట్టిపడింది. తొలుత శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో బస చేయగా, అనేక మంది భక్తులు స్వామి ఆశీస్సులు తీసుకుని తరించారు. గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర దంపతులు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌లతో పాటు పలువురు ప్రముఖులు స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు.


అనంతరం స్వామి నారాయణపురంలో నిర్వహిస్తున్న సహస్ర చండీయాగంలో పాల్గొన్నారు. గురువారం రాత్రి ఖమ్మంలోని వద్దిరాజు రవిచంద్ర స్వగృహంలో స్వామీజీకి వేద మంత్రోఛ్చారణలు, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో శాస్ర్తోక్తంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ, సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక చింతనే రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. దేశంలో హిందూ ధర్మ ఉద్యమం చేసే ఏకైక పీఠం శారదా పీఠమన్నారు. ధర్మ ప్రచార యాత్రకు విశేష స్పందన ఉండటం గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్రంతో తమ పీఠానికి ప్రత్యేక అనుబంధముందని, ఈ రాష్ట్రం నుంచే ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి హిందూ ధర్మ ప్రచార యాత్రను సాగించడం రాష్ట్ర ప్రత్యేకత అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తమపై గురుభావన ఉందని, రాష్ట్రం ఆధ్యాత్మిక, భక్తిభావంతో పరిఢవిల్లుతుందని అభివర్ణించారు.

నేడు స్వామీజీలకు పుష్పాభిషేకం
నగరంలోని రాజ్‌పథ్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో పీఠాధికారి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిలకు కనుల పండువగా పుష్పాభిషేకం నిర్వహించనున్నారు. ఈమేరకు ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మహాక్రతువుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles