రూ.2 లక్షల నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల పట్టివేత


Thu,October 17, 2019 11:41 PM

కొత్తగూడెం క్రైం: విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు నిషేధిత ప్లాస్టిక్ గ్లాసుల బాక్సులను రవాణా చేస్తున్న వ్యక్తిని, వాహనాన్ని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూ గొల్లగూడెంలో అదుపులోకి తీసుకున్నారు. పర్యావరణానికి హాని చేసే రూ. 2 లక్షల విలువైన ప్లాస్టిక్ గ్లాసులను పట్టుకొని మున్సిపల్ కమిషనర్ సంపత్‌కు అప్పగించారు. ఈ విధంగా అప్పగించిన ప్లాస్టిక్ గ్లాసుల బాక్సులను మున్సిపల్ కమిషనర్ సీజ్ చేసి సదరు నిషేధిత ప్లాస్టిక్‌ను రవాణా చేస్తున్న వ్యక్తి మేకల రాంబాబుకు రూ.20 వేలు జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో త్రీటౌన్ ఎస్‌ఐ శ్రీనివాసరావు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది జగన్, విజయ్, వెంకట నారాయణలు పాల్గొన్నారు.


ప్లాస్టిక్ వ్యాపారికి రూ.20వేలు జరిమానా...
కొత్తగూడెం అర్బన్: ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై మున్సిపల్ కమిషనర్ అరిగెల సంపత్‌కుమార్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈమేరకు 50శాతం మ్రైకాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను విక్రయించే దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం ప్రగతినగర్‌లోని ఓ గోడౌన్‌లో అక్రమంగా నిల్వఉంచిన ప్లాస్టిక్ కవర్ల బ్యాగులను స్వాధీనం చేసుకొని ఆ యజమానికి రూ. 20వేల జరిమానా విధించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సరే ప్లాస్టిక్ కవర్లను వినియోగించిన, క్రయవిక్రయాలు జరిపినా జరిమానాతో పాటు పోలీసుల సహకారంతో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles