రహదారులు సౌకర్యవంతంగా ఉండాలి


Thu,October 17, 2019 01:44 AM

-జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య
ఇల్లెందు రూరల్, అక్టోబర్ 16 : ప్రజలకు సౌకర్యవంతంగా రహదారులు ఉండాలని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అధికారులకు సూచించారు. మండలంలోని సుభాష్‌నగర్ గ్రామపంచాయతీ లలితాపురం గ్రామంలో, కేసీఆర్ కాలనీలో పనుల నత్తనడకపై స్థానికుల ఫిర్యాదు మేరకు అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు. లలితాపురం గ్రామంలో మురుగుకాల్వలు, సీసీ రోడ్డు, అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణాలతోపాటు కేసీఆర్ కాలనీలో రహదారి నిర్మాణం మధ్యలోనే వదిలేశారని, భారీ వర్షాల కారణంగా నడిచేందుకు కూడా వీలులేక ఇబ్బంది పడుతున్నామని ఆయా ప్రాంత వాసులు తమ ఆవేదన వెలుబుచ్చారు. పలు వీధులలో పర్యటించి పనులను పరిశీలించిన ఆయన రెండేళ్ళు గడుస్తున్నా గ్రామంలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉండటంపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమంలో సుభాష్‌నగర్ సర్పంచ్ వల్లాల మంగమ్మ, విజయలక్ష్మినగర్ ఎంపీటీసీ పూనెం సురందర్, వార్డు సభ్యుడు కోటి, టీఆర్‌ఎస్ నాయకులు వల్లాల నర్సయ్య, బోళ్ళ సూర్యం తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles