ఇసుక కొరత లేకుండా చర్యలు


Thu,October 17, 2019 01:44 AM

పాల్వంచ రూరల్, అక్టోబర్ 16 : అభివృద్ధి కొరకు జరిగే నిర్మానాలకు నియోజక వర్గంలో ఇసుక కొరత లేకుండా చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు అన్నారు. బుధవారం మండలంలోని రంగాపురంలో ఇసుక ర్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లక్ష్మిదేవిపల్లి, పాల్వంచ మండలాల్లో ర్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. త్వరలో చాతకొండ, పాల్వంచ మండలంలోని బండ్రిగొండ గ్రామాల్లో లభించే నాణ్యమైన ఇసుకకు ర్యాంపులను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్‌కుమార్ శర్మ, ఎంపీడీవో అల్బర్ట్, ఎంపీపీ సరస్వతి, సర్పంచ్‌లు మాళుతు హరి, కవిత, ఏపీవో రంగా, సోసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్ నాయకులు వనమా రాఘవ, మహీపతి రామలింగం, పట్టణ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మంతపూరి రాజూగౌడ్, కాల్వ ప్రకాశరావు, దాసరి నాగేశ్వరావు, సత్తెనపల్లి వెంకన్న, షణ్ముఖాచారి, మేదరమెట్ల వెంకటేశ్వరావు, గంధం సతీష్, బేతంశెట్టి విజయ్, మన్నేపల్లి వినయ్, కందుకూరి రాము, బోందిల హరి, బాణోతు శ్రీను, మురళి, రంజిత్, తదితరలు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles