బీటీపీఎస్ పనులను వేగవంతం చేయాలి


Thu,October 17, 2019 01:43 AM

మణుగూరు, నమస్తేతెలంగాణ: భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణ పనులను జెన్కో డైరెక్టర్(ప్రాజెక్టు) ఎం.సచ్చితానందం, డైరెక్టర్(సివిల్) అజయ్ బుధవారం పరిశీలించారు. తొలుత వారు ప్లాంటు నందు కలియ తిరుగుతూ అన్ని రకాల నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అన్ని పనులు మరింత వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనులను షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే యూనిట్-1లో సింకర్నైజేషన్ విజయవంతంగా నిర్వహించామని, వచ్చేనెలలో సీవోడీ చేస్తామన్నారు. ఈనెల 20 కల్లా యూనిట్-2లో లైటప్ చేసేందుకు నిర్మాణ పనులు వేగంగా చేస్తున్నామని పేర్కొన్నారు. నవంబర్‌లో యూనిట్-3లో లైటప్, యూనిట్-4లో హైడ్రాలిక్ టెస్టు చేసేందుకు పనులను పూర్తి చేస్తున్నామన్నారు. మణుగూరు ఏరియా నుంచి బీటీపీఎస్‌కు వచ్చే నెలలోనే రోడ్డు మార్గం ద్వారా కోల్ ట్రాన్స్‌పోర్టు చేసుకుంటామన్నారు. ఇప్పటికే మణుగూరు ఏరియా పీకేఓసీ-4, మణుగూరు ఓసీ(మల్లెపల్లి)నుంచి రోడ్డు మార్గం ద్వారా కోల్ ట్రాన్స్ పోర్టుకు ఎంఈవోఎఫ్ అనుమతులు వచ్చాయన్నారు. ఈఏడాది చివరి కల్లా విద్యుత్ ఉత్పత్తి చేసేందు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారితో పాటు బీటీపీఎస్ సీఈ పిల్లి బాలరాజు, జోన్కో, భెల్ అధికారులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles