మత్స్యకారుల అభివృద్ధికి కృషి


Tue,October 15, 2019 02:59 AM

-ఎమ్మెల్యే వనమా
పాల్వంచ రూరల్, అక్టోబర్ 14 : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు అన్నారు. సోమవారం పట్టణంలోని పాతపాల్వంచ చింతల చెరువులో 57వేల వివిధ రకాల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా చెరువుకట్టపై మత్స్యకారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందిస్తోందన్నారు. ఇరిగేషన్ శాఖ డీఈ రామ్‌కిషోర్‌ను చింతచెరువు నీటి సామర్థ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యశాఖ జిల్లా అధికారి వరదారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని 684 చెరువుల్లో 1,78,12,800 చేపపిల్లలను వదలాలని లక్ష్యంగా చేసుకున్నామని, ఇప్పటి వరకు 678 చెరువుల్లో 1,45,22,300 చేప పిల్లలను వదిలినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు బరపటి వాసుదేవరావు, సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, ఎంపీపీ మడి సరస్వతి, కొత్వాల సత్యనారాయణ, వనమా రాఘవేందర్, గొర్రె సాంబయ్య, సారయ్య, బేతంశెట్టి విజయ్, మన్నేపల్లి, నారకట్ల రాజశేఖర్, మేదరమెట్ల వెంకటేశ్వరావు, మహీపతి రామలింగం, నాగరాజు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles