రామున్ని దర్శించుకున్న ప్రముఖులు


Sat,October 12, 2019 11:51 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ట్యాక్సెస్‌ హైదరాబాద్‌ వాస శేషగిరి, ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ట్యాక్సెస్‌ హైదరాబాద్‌ డాక్టర్‌ పురుషోత్తం, డీవై కమిషనర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ట్యాక్సెస్‌ ఖమ్మం డివిజన్‌ పీ.భువనేశ్వరరావులు శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి సాంప్రదాయబద్దంగా ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా వారు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియంను సందర్శించి సీతమ్మవారి నగలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం అర్చకులు ఆలయ విశిష్టత గురించి వారికి వివరించారు. తదుపరి ఆలయ అధికారులు, అర్చకులు వారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles