పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం


Fri,October 11, 2019 11:58 PM

-గ్రామ స్వరాజ్యం కోసం సీఎం కేసీఆర్ కృషి..
-సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉభయజిల్లాలు సస్యశ్యామలం
-లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు
-అశ్వారావుపేట నియోజకవర్గంలో రూ. 5కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ..


అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ/అశ్వారావుపేట రూరల్: గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 30రోజులు ప్రత్యేక పల్లె కార్యచరణ ప్రణాళిక దేశానికి ఆదర్శంగా నిలిచిందని లోకసభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో రూ. 5కోట్ల రూపాయల అభివద్ధి పనులు ప్రారంభించారు. దీనిలో భాగంగా శుక్రవారం అశ్వారావుపేట మండలంలోని బీమునిగూడెంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ, గిరిజన సంక్షేమ, ఇంజినీరింగ్‌శాఖ, ఎల్‌డబ్ల్యూఏ రూ.50లక్షల నిధులతో నిర్మించిన అదనపు గదుల భవనాన్ని స్థ్దానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, భద్రాద్రికొత్తగూడెం జడ్పీచైర్మన్ కోరం కనకయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చిందన్నారు. గ్రామాల్లో ఇదే స్ఫూర్తి కొనసాగించాలని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రతీ నెల పంచాయతీలకు రూ. 339 కోట్లు ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఉభయ జిల్లాలను సస్యశామలం చేయాలనే లక్ష్యంతోనే సీతారామా ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారని, దీంతో జిల్లాలో 4లక్షల 93వేల ఎకరాల భూమి సాగులోకి రానున్నదన్నారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, దమ్మపేట మండలంలో భూసేకరణ కోసం ప్రకటన విడుదల చేయటం జరిగిందన్నారు. ములకలపల్లి మండల వరుకు పనులు జరిగాయని వివరించారు.

అశ్వారావుపేట నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకున్నానని, మండలానికి ఒక గ్రామాన్ని తీసుకుని అభివృద్ధి చేయటానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి వివిధ సమస్యలతో కూడిన వినతిప్రతాన్ని ఎంపీకి అందచేశారు. తిరుమలకుంట, వేదాంతపురం, నారాయణపురం, బీమునిగూడెం, అచ్యుతాపురం, ఉట్లపల్లి గ్రామ పంచాయతీల సమస్యలపై వినతిపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, జడ్పీటీసీలు చిన్నంశెట్టి వరలక్ష్మి, పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీలు జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, సర్పంచ్‌లు తాటి భవాని, నాగలక్ష్మి, ఎంపీటీసీలు కాసాని దుర్గా, మారుతి లలిత, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కాసాని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles