జీసీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి


Fri,October 11, 2019 11:54 PM

ఇల్లెందు, నమస్తే తెలంగాణ : నాణ్యమైన ఉత్పత్తులతో ప్రజల ముంగిటకు వస్తూ జీసీసీ అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో పీవీ గౌతమ్ విజ్ఞప్తి చేశారు. మండలంలోని సుభాష్‌నగర్‌లో ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన గిరిబజార్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఐటీడీఏ, జీసీసీ సహకారంతో స్థానికంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తయారు చేసిన ఉత్పత్తులను ప్రజలకు అందబాటులోకి తెచ్చేందుకు గిరిబజార్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. అనంతరం ఐటీడీఏ నిధులతో నిర్మించిన గిరిజన భవన్‌ను ఆయన తనిఖీ చేశారు. త్వరితగతిన విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, జడ్పీటీసీ వాంకుడోత్ ఉమాదేవి, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్‌కుమార్, కో-ఆప్షన్ గాజీ, సుభాష్‌నగర్ సర్పంచ్ వల్లాల మంగమ్మ, ఉపసర్పంచ్ నేలవెల్లి నర్సింహారావు, వార్డు సభ్యులు ఊరకొండ ధ నుంజయ్, ఆళ్ల నాగేశ్వరరావు, శివనాయక్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో జాఫర్‌ఖాన్, జీసీసీ డీఎం వాణి, మేనేజర్లు శంకర్, నర్సింహారావు, లక్ష్మణ్, సంజీవయ్య, ఐటీడీఏ ఈఈ రాములు, ఏఈ శివప్రసాద్, గురుకుల ఆర్‌సీవో బురాన్ పాల్గొన్నారు.


రిజర్వేషన్‌లు అమలు చేయాలి..
ఖమ్మం, నమస్తే తెలంగాణ : షెడ్యూల్డ్ ఏరియాలో స్థానికంగా నివాసం ఉంటున్న గిరిజన తెగల యువతీ, యువకులకు, గిరిజన కుటుంబాలకు, గిరిజనులకు చెందిన తాత, ముత్తాతల సంబంధీకుల ఆధారాలను బట్టి రిజర్వేషన్‌లు అమలు చేయాలని, ఏజెన్సీ మండల తహసీల్దార్లకు ఐటీడీఏ పీవో గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవన్‌లో జరిగిన సమావేశంలో ఏజెన్సీ మండల తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో షెడ్యూల్డ్ ట్రైబ్ గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేయడానికి జేసీ (ఇన్‌చార్జ్) అనురాగ్ జయంతితో కలిసి మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles