1.78 కోట్ల చేపపిల్లల పంపిణీయే లక్ష్యం


Fri,October 11, 2019 11:54 PM

-జిల్లా మత్స్యశాఖాధికారి వరదారెడ్డి
చండ్రుగొండ : జిల్లాలో 1,78,21,800 చేప పిల్లల పంపిణీయే లక్ష్యంగా పెట్టుకోవటం జరిగిందని జిల్లా మత్స్యశాఖాధికారి కే వరదారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం చండ్రుగొండ మండలంలోని వెంగళరావు ప్రాజెక్టులో 2,38,500, మద్దుకూరు ప్రాజెక్టులో 81వేల చేప పిల్లలను జిల్లా మత్స్యశాఖాధికారి వరదారెడ్డి చేతుల మీదుగా విడిచి పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వరదారెడ్డి మాట్లాడుతూ..జిల్లాలో 678 చెరువులకు గాను, ఇప్పటి వరకు 648 చెరువుల్లో చేప పిల్లలను విడిచి పెట్టడం జరిగిందన్నారు. బొచ్చ, శీలావతి, ఎర్రమోస్, రకాలను పంపిణీ చేయటం జరిగిందన్నారు. ప్రభుత్వం నూరుశాతం సబ్సిడీపై రైతులకు చేప పిల్లలను పంపిణీ చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, ఎంపీటీసీ సంగొండి వెంకటకుమారి, సర్పంచ్‌లు బానోత్ రన్య, ఇర్పా లక్ష్మీపతి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాలోత్ బోజ్యనాయక్, మాజీ జడ్పీటీసీ జడ వెంకయ్య, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, సీనియర్ నాయకులు బానోత్ రాముడు, సత్తి నాగేశ్వరరావు, బొమ్మగంటి దశరథ్, బీరకాయల వెంకన్న, బన్నె నాగరాజు, జోగు వెంకటనారాయణ, కీసరి భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles