హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం


Fri,October 11, 2019 11:53 PM

-తండాల్లో ప్రచారం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ
ఇల్లెందు, నమస్తే తెలంగాణ : హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. మఠంపల్లి మండలంలోని కాల్వపల్లితండా, జంలాతండా, బీల్యానాయక్‌తండా, నిమ్మతండా, నాయక్‌తండా, కామంచికుంట తండాలలో స్త్రీ, శిషు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించిన విషయాన్ని మరిచిపోవద్దని గుర్తుచేశారు. హజూర్‌నగర్ కేంద్రంలో రూ.కోటి వ్యయంతో సేవాలాల్ భవన్ నిర్మిస్తామని, రూ.30 కోట్ల వ్యయంతో గిరిజన గురుకులాన్ని తీసుకొస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం అవుతానని ఒకసారి, కేంద్ర మంత్రి అవుతానని మరొకసారి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓట్లు వేయించుకొని మోసం చేశారని విమర్శించారు. ఈ సారి కారు గుర్తుకు ఓటువేసి సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో మంత్రి సత్యవతితోపాటు మానుకోట ఎంపీ మాళోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్‌నాయక్, ఇల్లెందు టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు హరిసింగ్‌నాయక్, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ), తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles