అంతర్జాతీయ సదస్సులతోనే సాంకేతికతలో మార్పు


Fri,October 11, 2019 11:53 PM

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ : అంతర్జాతీయ సహకార వాణిజ్య సదస్సుల ద్వారా సాంకేతిక మార్పిడి సాధ్యమవుతుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి వర్యులు నరేంద్ర సింగ్ టోమర్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు శాఖ మంత్రి పియూష్ గోయల్, సహాయ వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తంబాయ్ రూపాల, పాడి పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజాసింగ్ కేంద్ర సహాయ చేపల పెంపకం మంత్రి కైలాస్ చౌదరి స్పష్టం చేశారు. వాణిజ్య సదస్సు వల్ల సాంకేతిక మార్పిడి, గ్లోబలైజేషన్ జరిగి వాణిజ్య ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయని అన్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో అక్టోబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజులు పాటు జరిగే అంతర్జాతీయ సహకార వాణిజ్య సదస్సును శుక్రవారం వారు సందర్శించారు. ఇటువంటి సదస్సుల వలన రైతులు నిపుణులు ఆధునిక సాంకేతికతపై నైపుణ్యం పెంపొందించుకునేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.


వాణిజ్య సదస్సులో టీఎస్ ఆయిల్‌ఫెడ్ ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సంస్థ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రా ష్ట్రంలో పామాయిల్ సా గు, విధానం, రైతులకు అందిస్తున్న రా యితీలు ఆయిల్ ఫెడ్ విజయ బ్రాం డ్‌తో ఉ త్పత్తి చేస్తున్న నూనెలు విక్రయం, మార్కెటింగ్ విధానం పామాయిల్ గెలల ధర నిర్ణయం, ఆయిల్ రికవరి, పామాయిల్ రైతులకు మార్కెట్‌తో పటు రవాణా చార్జీల చెల్లింపు వంటి అంశాలను సందర్శకులకు వివరించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల సహకార సంస్థలతో పాటు 36 దేశాల సహకార సంస్థల ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి టీఎస్ మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎన్‌సీడీసీ తెలంగాణ ప్రతినిధి తేజోపతి, ఆయిల్‌ఫెడ్ సీనియర్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, అరవింద్, టెక్నికల్ మేనేజర్ జే సత్యనారాయణ, ఏరియా ఆఫీసర్ ఎస్ శంకర్ పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles