దసరా వేడుకలు


Thu,October 10, 2019 12:04 AM

-ఆనందోత్సాహాలతో విజయదశమి పర్వం
-శమీ శ్లోకం.. జమ్మి చెట్టు పూజలతో తరించిన భక్తగణం..


ఇల్లెందు, నమస్తే తెలంగాణ: ఇల్లెందులో దసరా వేడుకలు మైసూర్ ఉత్సవాలను తలపించాయి. జమ్మి గ్రౌండ్‌లో జమ్మి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. పాలపిట్టను చూసి ప్రజలంతా పరవశించారు. దుర్గామాతను దర్శించుకున్నారు. పట్టణంలని స్టేషన్‌బస్తీ, ఇల్లెందులపాడు, నెం.2బస్తీ, 15నెం.బస్తీ, ఆంబజార్, పాతబస్టాండ్, ఇందిరానగర్ నుంచి జమ్మి గ్రౌండ్‌కు వచ్చిన రథాల్లోని అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి, పూలు చల్లి స్వాగతం పలికారు. అమ్మవారి షావాలు జమ్మి వద్దకు వస్తుంటే తిలకించిన ప్రజలు భక్తి పారవశ్యంతో పరవశించిపోయారు. అనంతరం ఫారెస్టు గ్రౌండ్‌లో మున్సిపల్ పాలకవర్గం, దసరా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వేడకలు అలరించాయి. వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాళోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మాహబూబాబాద్ జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, పట్టణ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా ఇల్లెందులో దసరా వేడుకలు నిర్వహించడం హర్షనీయమన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకుంటూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎంపీ మాళోత్ కవిత మాట్లాడుతూ.. దసరా వేడుకలను ప్రతిఏటా మైసూర్ స్థాయిలో నిర్వహించడం ఇల్లెందు ప్రత్యేకతగా అభివర్ణించారు. స్వరాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉండటానికి సీఎం కేసీఆర్ అందిస్తున్న చక్కటి పాలనే కారణమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ మాట్లాడుతూ.. ఇల్లెందులో దశాబ్ధాలుగా దసరా వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గుర్తు చేశారు. ఈసారి కూడా దసరా పండుగ రోజున ప్రజలను ఆనందింప చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిఏటా ఇదే స్థాయిలో పండుగ సంబురాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ప్రజలంతా ఆనందంగా ఉండాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. అనంతరం జబర్దస్త్ బృందం, మిమిక్రీ రమేష్, పలువురు కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చివరగా రావణ వథ కార్యక్రమం ఆకట్టుకుంది. వేడుకలు ప్రారంభం నుంచి ముగింపు వరకు కొనసాగిన పటుకుల మోత అలరించాయి. ఉత్సవ కమిటీ కన్వీనర్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, జడ్పీటీసీ వాంకుడోత్ ఉమాదేవి, వైస్‌ఎంపీపీ ప్రమోద్, టీఆర్‌ఎస్ నాయకులు పులిగళ్ళ మాధవరావు, మూల మధుకర్‌రెడ్డి, పరకాల శ్రీనివాసరెడ్డి, జేకే శ్రీనివాస్, ప్రహ్లాద్, సురేష్ లాహోటి, యలమందుల వాసు, బబ్లూ, యలమద్ది రవి, ఇందిరాల మురళి, మేకల శ్యాం, సీపీఐ నేత సారయ్య, సీసీఎం నేత నబి తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles