కొత్తగూడెం సమస్యలపై కలెక్టర్‌తో చర్చించిన ఎమ్మెల్యే వనమా


Thu,October 10, 2019 12:02 AM

కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం నియోజకవర్గ సమస్యలపై బుధవారం కలెక్టర్ రజత్‌కుమార్ శైనీతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. ఇంటి క్రమబద్ధీకరణ పట్టాల జీవో 70పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 1 నుంచి పట్టాల దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ నిలిచిపోయిందని, అర్హులైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, రోడ్లు, డ్రైన్లు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్(డీఎంఎఫ్), ఇసుక రీచ్‌ల తదితర సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఆర్‌డీఓ కె.స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles