ఘనంగా రామయ్య నిత్య కల్యాణం


Thu,October 10, 2019 12:01 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో స్వామివారికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు రామునికి అభిషేకం, ఆరాధన, అర్చన, సేవాకాలం, పుణ్యాహవచనం తదితర పూజలుగావించారు. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోగల శ్రీలక్ష్మీతాయామ్మ వారిని, అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ్ధప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియంలోని సీతమ్మ వారి నగలను తిలకించారు. బేడా మండపంలో నిత్య కల్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles