పక్కాగా ప్రత్యామ్నాయం..


Tue,October 8, 2019 01:02 AM

మూడో రోజు యథా విధిగా తిరిగిన బస్సులు
-ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు
-గొంతెమ్మ కోర్కెలకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం
-ఆర్టీసీ పూర్తిస్థాయి ప్రక్షాళన దిశగా ప్రభుత్వం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పండుగ పూట ప్రజలను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలనే ప్రభుత్వ లక్ష్యం నేరవేరింది. ఏ ఒక్క ప్రయాణికుడికి ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా ప్రభుత్వం సమ్మె తొలిరోజు నుంచి పక్కాగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల ప్రయోజనాలు, భద్రతే పరమావధిగా ప్రతీ డ్రైవర్‌ని అంచెల వారీగా బస్సును నడిపించి పూర్తిస్ధ్థాయిలో అర్హుడు అనుకుంటేనే వారికి బస్సును ఇచ్చి అన్నీ రూట్లలో బస్సులను నడిపారు. దీంతో ప్రజలందరూ పండుగకు ఇళ్లకు చేరుకుని మంగళవారం ఆనందోత్సహాల నడుమ దసరాను జరుపుకునేందుకు సమాయత్తమయ్యారు. శుక్రవారం అర్ధ్థరాత్రి నుంచి మొదలైన టీఎస్ ఆర్టీసీ జాక్ నాయకులు తలపెట్టిన నిరవదిక సమ్మె ప్రభావం జిల్లాలో ఎక్కడా కనిపించలేదు. మూడో రోజు కూడా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఏ ఒక్కరూ విధుల్లో చేరలేదు. అయినప్పటికీ ఆర్టీసీ, రవాణాశాఖ, పోలీస్ సిబ్బంది సమన్వయంతో ముందస్తుగా చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలతో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులన్నీ యథావిధిగా తిరిగాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగ దసరా మంగళవారం జరుపుకోనుండడంతో ఆర్టీసీ అధికారులు ముందస్తుగా ఎక్కువ సంఖ్యలో, ఎక్కువ రూట్లలో బస్సులను నడపారు. దీంతో తొలి, రెండో రోజు కంటే కూడా ఎక్కువగానే బస్సులు నడిచాయి. తొలిరోజు మూడు డిపోల మొత్తంగా డిపో, హైర్ బస్సులు కలిపి 172 బస్సులను నడపగా, రెండో రోజు బస్సుల సంఖ్య పెంచారు. కొత్తగూడెం డిపో పరిధిలో 43 డిపో బస్సులు, 22హైర్ బస్సులు, మణుగూరు డిపో పరిధిలో 34డిపో బస్సులు, 21హైర్ బస్సులు, భద్రాచలం డిపో పరిధిలో 42డిపో బస్సులు, 22 హైర్ బస్సులు నడిచాయి. మొత్తంగా మూడు డిపోల పరిధిలో 184బస్సులు నడిచాయి.

కనపడని సమ్మె ప్రభావం..
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం మూడోరోజు కూడా జిల్లాలో కనపడలేదు. మూడు డిపోల్లో మొదటి, రెండో రో జు కం టే ఆదనంగా బస్సులు వివిధ రూట్లలో నడిచాయి. తెల్లవారితే దసరా పండుగ జరుగనున్న నేపథ్యంలో సోమవారం అధిక మొత్తంలో ఆర్టీసీ అధికారులు బస్సులను నడిపి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశారు.కొత్తగూ డెం, మణుగూరు, భద్రాచలం డిపోలలో డ్రైవింగ్‌లో అనుభవమున్న డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవడంతో దాదాపు అన్నీ ఏరియాలకు బస్సులను తిప్పారు. ఎక్కువ సంఖ్యలో డ్రైవింగ్ పోస్టులకు అభ్యర్థులు రావడంతో జిల్లా రవాణాధికారి పీ రవీందర్ నేతృత్వంలో ఆ శాఖ అధికారులు ప్రతీ ఒక్కరి డ్రైవింగ్ లైసెన్స్‌లు క్షుణ్నంగా పరిశీలించి టెస్ట్ డ్రైవ్ అనంతరం వారిలో నిపుణులను ఎంపిక చేసుకొని విడతలవారీగా వారికి విధులను అప్పగిస్తూ వస్తున్నారు. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు షెడ్యూల్ ప్రకారం బస్సు సర్వీస్‌లను నడిపారు. ఇల్లెందు, మణుగూరు, ఖ మ్మం, హైదరాబాద్, విజయవాడ, మిర్యాలగూడ తదితర ప్రాంతాలకు సైతం బస్సులను నడిపారు. ప్రధానమైన రూట్లలో బస్సులు నడపడం వలన ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని గమనించిన జిల్లా అధికారులు అ దిశగా బస్సులను నడిపారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టి అధికమొత్తంలో పోలీసులను మోహరించడంతో వారు ఆర్టీసీ డిపో బయటికే పరిమితమయ్యారు. దీంతో సమ్మె ప్రభావం మచ్చుకైనా కనబడలేదు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles