ఘనంగా రామయ్య నిత్య కల్యాణం


Tue,October 8, 2019 12:59 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం రామాలయంలో స్వామి వారికి అర్చకులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అభిషేకం, ఆరాధన, అర్చన, సేవాకాలం, పుణ్యాఃవచనం తదితర పూజలు చేశారు. భక్తులు ప్రత్యేక పూ జలు చేశారు. ఆలయంలోగల శ్రీలక్ష్మీతాయారమ్మ వారిని, అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియంలో సీతమ్మ వారి నగలను తిలకించారు. బేడా మండపంలో శ్రీ సీతారామం ద్రస్వామికి అర్చకులు ఘనంగా నిత్య కల్యాణం నిర్వహించారు.


శ్రీమహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు శ్రీమహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే స్వామి వారికి సుప్రభాతసేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం తదితర పూజలను అర్చకులు నిర్వహించారు. స్థానిక చిత్రకూట మండపంలో ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సామూహిక శ్రీరామాయణ పారాయణం చేశారు. శ్రీలక్ష్మీతాయారమ్మ ఆలయంలో అమ్మవారిని అభిషేకించారు. అమ్మవారిని శ్రీమహాలక్ష్మిగా అలంకరించారు. సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు శ్రీలక్ష్మీతాయారమ్మ సన్నిధిలో సామూహిక కుంకుమార్చన పూజలు చేశారు. సాయంత్రం విశేష దర్బార్ సేవ, నివేదన, మహామంత్రపుష్పం, ప్రసాద గోష్టి పూజలు చేశారు. శ్రీ మహాలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాత్రి 7.30 నుంచి 8.30 వరకు శ్రీవారి తిరువీధి సేవ చేశారు.

నేడు నిజరూపలక్ష్మి అలంకారం
నేడు (విజయదశమి) అమ్మవారు శ్రీ నిజరూపలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ధనం, ధాన్యం, సంతానం, విద్య, అధికారం, వీరం, విజయం, ఐశ్వర్యం... ఇలా ఐష్టెశ్వర్యాలను ప్రసాదించేందుకు ఆదిలక్ష్మి అమ్మవారు... తన నిజ రూపంలో అందరినీ అనుగ్రహిస్తోంది.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles