నూతన మద్యం పాలసీకి ఆమోదం


Tue,October 8, 2019 12:58 AM

కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 7 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలపరిమితి కోసం సోమవారం నూతన మద్యం దుకాణాల పాలసీని ఆమోదించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలను ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్ కుమార్ వివరాలను ఉత్తర్వులను విడుదల చేశారు. జిల్లాకు సంబంధించిన వివరాలను జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ చింతారెడ్డి నర్సింహారెడ్డి వివరాలను వెల్లడించారు. జిల్లాలోని ఆరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్ల పరిధిలో మొత్తం 76 మద్యం (ఏ4) దుకాణాలు ఉండగా, ఇందులో 35 మద్యం దుకాణాలు ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. వీటికి సంబంధించి కలెక్టర్ ద్వారా గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 9వ తేదీన విడుదల అయి, ఆ రోజు నుంచి ఈ మద్యం దుకాణాలకు ఆసక్తి గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించబడుతాయని సూపరింటెండెంట్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆదివారం మినహాయించి 16వ తేదీ వరకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దరఖాస్తులు స్వీకరించడబడుతాయన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles