రోగులకు మెరుగైన సేవలు అందించాలి : ఎమ్మెల్యే


Tue,October 8, 2019 12:58 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: రోగులకు మెరుగైన సేవలు అందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కోరారు. స్థానిక గణేష్ టెంపుల్ ఏరియాలో అమృత చెస్ట్ క్రిటికల్ కేర్ ఆస్పత్రిని సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి దిశగా జిల్లా కేంద్రం పయనిస్తోందన్నారు. కొత్త కొత్త ఆస్పత్రులు, షోరూంలు ఏర్పాటవుతున్నాయని, వ్యాపార రంగంలో ఈ ప్రాంతం ముందుకు సాగుతున్నదని అన్నారు. రోగులకు వైద్యులు మెరుగైన సేవలందించాలని కోరారు. అమృత ఆస్పత్రి వైద్యుడు బాబురావు ఇరుకు మాట్లాడుతూ... గడిచిన మూడేళ్లలో హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో పనిచేస్తూ పేద ప్రజలకు మరింత సేవ చేయడానికి కొత్తగూడెంలో కార్పోరేట్ స్థాయిఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నందుకు తమకు సంతోషంగా ఉందన్నారు. ఊపిరితిత్తులు, క్రిటికల్ వైద్య సేవలను తమ ఆస్పత్రిలో అందిస్తామన్నారు. షుగర్ వైద్య నిపుణురాలు డాక్టర్ ఇరుకు జయ.. కూడా సేవలందిస్తారని చెప్పారు. 24 గంటల పాటు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సర్వీసులు అందించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, సింగరేణి జీఎం పర్సనల్ (ఆర్‌సీ, ఐఆర్ అండ్ పీఎం) ఎ.ఆనందరావు, సింగరేణి అధికారులు పి.రాజీవ్‌కుమార్, ఉమామహేశ్వరరావు, డాక్టర్ విజేందర్, కనకరాజు, విజయకుమార్, బాబూరావు, అమృత ఆస్పత్రి యాజమాన్యం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles