12న రొట్టమాకురేవులో అవార్డుల ప్రదానోత్సవం


Mon,October 7, 2019 01:40 AM

కారేపల్లి రూరల్, అక్టోబర్6: సాహితీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకునే రొట్టమాకురేవు కవిత్వ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈనెల 12వ తేదీన రొట్టమాకురేవులో నిర్వహించనున్నారు. గత ఐదేళ్లుగా రొట్టమాకురేవులో కవి యాకూబ్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. రొట్టమాకురేవు కవిత్వ అవార్డు-2019 పేరుతో ఈ నెల 12న మరో కార్యక్రమానికి సిద్దమయ్యారు. యాకూబ్ నిర్వహించే కార్యక్రమాలతో రొట్టమాకురేవు గ్రామం ప్రపంచానికి పరిచయమైంది. చిన్న పల్లెటూరైన తన స్వగ్రామంలో కేఎల్ పుస్తక సంగమం పేరుతో కవి యాకూబ్ ఓ లైబ్రరీని నిర్మించి వేలాది పుస్తకాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రొట్టమాకురేవులో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాదిమంది కవులు హాజరుకావడం, ముఖ్య అతిథులుగా వివిధ పత్రికల సంపాదకులు రావడంతో కార్యకమానికి ప్రాధాన్యత సంతరించుకుంది. యాకూబ్ తండ్రి షేక్ మహ్మద్ మియా, గురువు గారైన ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే కేఎల్ నర్సింహరావు, పురిటిపాటి రామిరెడ్డి పేర్లతో స్మారక పురస్కారాన్ని యాకూబ్ రూపొందించారు. 2011నుంచి 2014 వరకూ నలుగురు కవులను మొదట ఎంపికచేసి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు ఘంటా చక్రపాణి, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, గోరటి వెంకన్న, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ హాజరై అవార్డులు అందజేశారు. ఈ ఏడాది అవార్డులను ఈనెల 12న రొట్టమాకురేవులోనే అందజేస్తున్నట్లు నిర్వాహకులు ప్రముఖ కవి యాకూబ్ తెలిపారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles