సింగపూర్‌లో బతుకమ్మ సంబురాలు


Mon,October 7, 2019 01:40 AM

లక్ష్మీదేవిపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు విదేశాలకు కూడా వ్యాపిస్తున్నాయి. తెలంగాణ రాష్ర్టానికి చెందిన ప్రజలు ఆయా దేశాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడటంతో మన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మండలానికి చెందిన ముక్కా కనకేశ్వర్‌రావు కుమార్తె నాగాంబిక సింగపూర్‌లో స్థిరపడ్డారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా సింగపూర్‌లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో సంబవాంగ్ పార్కులో సుమారు వెయ్యి మంది తెలుగువారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పదేళ్లుగా విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా టీసీఎస్‌ఎస్ చరిత్రలో నిలిచిపోయిందని అధ్యక్షుడు నీలం మహేందర్, గడప రమేష్‌బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, బసిక ప్రశాంత్‌రెడ్డి, నల్ల భాస్కర్ గుప్తాలు కమిటీ సభ్యులకు పేరుపేరున ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles