బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా


Mon,October 7, 2019 01:40 AM

అశ్వాపురం: మండలంలోని మల్లెలమడుగు, మొండికుంట గ్రామాల్లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు కోలాటం ఆడారు. మల్లెలమడుగులో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆయన పాల్గొని కొలాటం ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత కల్పించిందన్నారు. మహిళలంతా ఏకమై ఒకే ప్రాంతంలో బతుకమ్మలతో పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం మల్లెలమడుగు సర్పంచ్ కోడి క్రిష్ణవేణి, ఉపసర్పంచ్ చావా వీరరాఘవులు, ఎంపీటీసీ బేతం రామక్రిష్ణ ఎమ్మెల్యే కాంతారావును ఘనంగా సన్మానించారు. అతిథులైన డీసీసీబీ డైరెక్టర్ తూళ్ళూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, జిల్లా కోఆప్షన్ సభ్యుడు షరీపుద్దీన్, మండల కోఆప్షన్ సభ్యుడు ఖదీర్‌లను ఘనంగా సన్మానించారు. అనంతరం సాంస్కృతిక కళాబృందం వారు తెలంగాణ ఆట పాటలతో అలరించారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles