వీరలక్ష్మీ అలంకారంలో అమ్మవారు


Mon,October 7, 2019 01:39 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీవీరలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామునే రామాలయం తలుపులు తెరిచి అర్చక స్వాములు స్వామివారికి సుప్రభాతసేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం తదితర పూజలు నిర్వహించారు. స్థానిక చిత్రకూట మండపంలో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సామూహిక శ్రీరామాయణ పారాయణం నిర్వహించారు. తదుపరి అర్చకులు శ్రీలక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని శ్రీవీరలక్ష్మీగా అలంకరించి భక్తుల సందర్శనార్ధం ఉంచారు. సాయంత్రం 3నుంచి 5గంటల వరకు శ్రీలక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం 6నుంచి 7.30నిమిషాల వరకు విశేష దర్భార్‌సేవ, నివేదన, మహామంత్రపుష్పం, ప్రసాదగోష్ఠి తదితర పూజలు చేశారు. శ్రీవీరలక్ష్మీ అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించారు. రాత్రి 7.30నుంచి 8.30వరకు శ్రీవారి తిరువీధిసేవ జరిపారు. నేడు అమ్మవారు శ్రీమహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles