సదరం క్యాంపునకు 384 మంది హాజరు..


Sun,October 6, 2019 03:09 AM

కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 5 : జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ(డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సదరం క్యాంపునకు 384మంది హాజరైనట్లు డీఆర్‌డీఓ పి.జగత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శారీరక అంగవైకల్యం 243మంది, వినికిడి లోపం 43మంది, దృష్టిలోపం 60, మానసిక రుగ్మత 24, బుద్దిమాంద్యం 14మంది దివ్యాంగులు హాజరైనట్లు పేర్కోన్నారు. ఈ క్యాంపునకు హాజరైన దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలను చేపట్టినట్లు డీఆర్‌డీఓ చెప్పారు. డాక్టర్లు బి.మురళీధర్, పి.సురేష్, జి.రవిబాబు, అజ్మీర వెంకన్న, కె.శ్రీధర్, వై.రాజశేఖరరెడ్డి, ఫిజియోథెరపిస్టులు పి.వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌రావు, ఆడియోలాజిస్టు ఆదర్శ్ కుమార్, ఆప్తాలమిక్ అసిస్టెంట్ ఎం.తిరుమలరావు, వైద్య సహాయకులు వి.పద్మావతి, జె.శ్రీరాం, డీఆర్‌డీఏ సిబ్బంది, వివిధ మండలాల ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles