డెకాయిటీ గ్యాంగ్ అరెస్టు


Sun,October 6, 2019 03:09 AM

లక్ష్మీదేవిపల్లి, అక్టోబర్ 5 : మండల కేంద్రంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్ వద్ద చుంచుపల్లి సీఐ కరుణాకర్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టి దోపిడీ దొంగలను అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన అబ్దుల్ ఖలీల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి సీఐ కరుణాకర్ తన బృందంతో సీసీకెమేరాల ద్వారా మొత్తం 13 మంది గ్యాంగ్‌ను గుర్తించడం జరిగింది. వీరు గత నెల 29వ తేదీన ఖలీల్ అనే వ్యక్తికి మాయమాటలు చెప్పి మహిమలు కలిగిన నల్లపసుపు ఉన్నట్లు నమ్మబలికి అతనిని రప్పించి లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతువాగు వద్దకు తీసుకొచ్చారు. అతనిపై 13 మంది గ్యాంగ్ దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.2 లక్షలను తీసుకొని పారిపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా వీరిని గుర్తించిన పోలీసులు ఇల్లెందు క్రాస్‌రోడ్ వద్ద ఏడుగురిని అరెస్టు చేసి, రూ.1,64,000, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ఈ వాహన తనిఖీల్లో సీఐతో పాటు ప్రొబేషనరీ ఎస్సై అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles