చేపల పెంపకం బహుళ ప్రయోజనకరం


Sun,October 6, 2019 03:09 AM

ఇల్లెందు రూరల్/టేకులపల్లి: చెరువుల్లో చేపల పెంపకం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అన్నారు. ఇల్లెందు మండలంలోని సుదిమళ్ల గ్రామపంచాయతీ సుదిమళ్ళ పెద్దచెరువులో మత్స్యుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేపల వదిలే కార్యక్రమాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ఈక్రమంలోనే చెరువులో చేపలు పెంచే కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇరిగేషన్‌శాఖ పరిధిలోని చెరువుల్లో పూర్తి సబ్సిడీతో చేప పిల్లలను వదిలాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చెరువుల్లో చేపల పెంపకంపై అనేక సంవత్సరాలుగా ఆధారపడి జీవిస్తున్న సొసైటీలకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఆర్థికంగా మేలు చేకూరుస్తుందన్నారు. చెరువుల్లో పెరిగిన చేపలను గ్రామస్థులకు సరసమైన ధరలకు విక్రయించాలని సూచించారు. అనంతరం మత్య్సశాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. టేకులపల్లి మండలంలో రోళ్లపాడు ప్రాజెక్టు, రామచంద్రునిపేట పంచాయితీ మోరుట్ల చెరువులో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ చేప పిల్లలను వదిలారు.


అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుటకు, మత్స్యకారుల సంక్షేమం కోసం గొప్ప కార్యక్రమమని, నూరుశాతం సబ్సిడీతో చేపపిల్లలను పెంచుటకు పంపిణీ చేసి చెరువులో పిల్లలను వదులుతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. రోళ్ళపాడు ప్రాజెక్ట్‌లో 132000ల, బోడు మోరుట్ల చెరువులో 72000ల చేప పిల్లలను వదిలారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, రైతు సమన్వయ సమితి సభ్యుడు పులిగళ్ళ మాధవరావు, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, వైస్‌ఎంపీపీ దాస్యం ప్రమోద్‌కుమార్, సర్పంచ్‌లు కల్తి పద్మ, చీమల వెంకటేశ్వర్లు, కో-ఆప్షన్ గాజీ, సునేష్, యలమద్ది రవి, జానీబాబా, మెట్టెల కృష్ణ, ఎల్.కృష్ణ, కుంజ సుగుణయ్య, కుంజ సుధాకర్, పండు, చీమల బాబు, కాయం రమేష్, పిన్నబోయిన వెంకన్న, చీమల లక్ష్మినర్సు, రాష్ట్ర నాయకులు బానోత్ హరిసింగ్‌నాయక్, అధికారులు ఎంపీడీఓ విజయ, ఎంపీపీ భూక్య రాధ, సర్పంచ్ ధరావత్ లలిత, ఈసాల ఉపేందర్, ఇర్ప లక్ష్మీనారాయణ, బానోత్ విజయ, ఎంపీటీసిలు జాలాది అప్పారావు, చింతా శాంతకుమారి, బానోత్ రామ నాయక్, బానోత్ కిషన్, బోడ బాలు, కల్తూరి కందస్వామి, చీమల సత్యనారాయణ, భూక్య తావుర్య నాయక్, భద్రునాయక్, ధరావాత్ శంకర్, చింత వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles