ప్రజలందరి క్షేమానికే..


Sat,October 5, 2019 01:26 AM

-హాజరు కానున్న సీఎం కేసీఆర్
-నాలుగు రాష్ర్టాల నుంచి పీఠాధిపతుల రాక
-200 మంది రుత్వికులతో ప్రవచనాలు
-ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ సాదర ఆహ్వానం
-మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
-సహస్ర చండీ యాగం పోస్టర్ ఆవిష్కరణ


ఖమ్మం, నమస్తే తెలంగాణ : ప్రజా రావాణాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌టీసీ సంస్థ సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రయాణీకులకు ఇబ్బంది కలుగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్‌టీసీ సమ్మె నేపథ్యంలో శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. దసరా పండుగని పురష్కరించుకుని ప్రజలు అధికంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 2100 అద్దె బస్సులు నడపాలని రోజువారీ వేతనంగా హయ్యర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి అనుభవం కలిగిన డ్రైవర్లను నియమించడం జరుగుతుందన్నారు. ఆర్‌టీసీ ప్రాంగణంలో అవసరమైన మేరకు 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పాఠశాలలకు, విద్యా సంస్థలకు సెలవు ఉన్న నేపథ్యంలో సదరు వాహనాలకు తాత్కాలిక పర్మిట్‌లు అందించి వాటిని వినియోగించుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆర్‌టీసీ కార్మికులు సూచించిన 26 డిమాండ్లపై చర్చించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కమిటీ నియమించారని సదరు కమిటీ నివేధిక సిద్ధం చేసిన తరువాత కార్మికులను ఉపయోగకరంగా ఉండే విధంగా సీఎం నిర్ణయం తీసుకుంటారని, కార్మికులు సమ్మె విరమించుకోవాలని మంత్రి కోరారు.

ప్రస్తుతం ఉన్న ఎస్మా ఉన్న నేపథ్యం సమ్మెలో పాల్గొనే ఉద్యోగులు పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి కార్మికులు సహకరించాలని మంత్రి కోరారు. జిల్లాలో ప్రజల రవాణా కోసం ఉపయోగించే క్యాబ్‌లు, ట్యాక్సీలు, సమ్మె నేపథ్యంలో అధికంగా వసూళ్లు చేయకుండా అవసరమైన తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. జిల్లాలో ఉండే 7 సీటర్ ఆటోలకు, ఇతర ప్రయాణ వాహనాలను పరిశీలించి వాటికి తాత్కాలిక పర్మిట్‌లు అందించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ ఆప్ పోలీసు (డీజీపీ) మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్‌టీసీ, పోలీసు, రవాణాశాఖ అధికారులు ఒకే స్ట్రాటజీ ప్రకారం పనిచేయాలని ఏ సమస్య ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని శుక్రవారం నుంచి గ్రౌండ్ లెవల్ నుంచి సిద్ధం కావాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. అనంతరం స్థానిక బస్‌డిపోను సందర్శించి, బస్టాండ్స్, బస్‌డిపోలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ అనురాగ్‌జయంతి, జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ శిరీష, అదనపు పోలీసు కమిషనర్ ఆఫ్ పోలీసు మురళీధర్, రీజినల్ మేనేజర్ ఆర్‌టీసీ కృష్ణమూర్తి, ప్రాంతీయ రవాణాశాఖాధికారి క్రిష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles