అన్నపురెడ్డిపల్లి జిల్లాలో ఆదర్శవంతం కావాలి


Sat,October 5, 2019 01:25 AM

అన్నపురెడ్డిపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అన్నపురెడ్డిపల్లి మండలాన్ని అభివృద్ధి చేసి జిల్లాలో ఆదర్శంగా నిలపాలని, మండలం ఉత్తమ గ్రేడు సాధించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని మండల ప్రత్యేకాధికారి, ఆర్డీవో స్వర్ణలత పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె మండలంలోని పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులను వేగవంతగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తొలుత గుంపెన గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పారిశుధ్య పనులను పరిశీలించి, ప్రత్యేకాధికారులను పారిశుధ్య పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దిరెడ్డిగూడెం పంచాయతీలో పర్యటించి డంపింగ్‌యార్డ్‌కు శంకుస్థాపన చేశారు.


అన్నపురెడ్డిపల్లి పంచాయతీలో వైకుంఠదామానికి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఆర్డీవో స్వర్ణలత మాట్లాడుతూ.. పంచాయతీ అభివృద్ధిలో ఉత్తమ గ్రేడు సాధించేలా ఆదర్శవంతగా తీర్చిదిద్ధేందుకు కృషి చేయాలన్నారు. ఎంపీడీవో రేవతి, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సన్నేపల్లి నాగేశ్వరరావు, జడ్పీటీసీ లాలమ్మ, ఎంపీపీ సున్నం లలిత, వైస్ ఎంపీపీ రామారావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మిడియం సురేష్, అగ్గి కవిత, బోడా పద్మ, ఉప సర్పంచ్‌లు మామిళ్లపల్లి లక్ష్మణరావు, పర్సా వెంకటేశ్వరరావు, నున్నా బసవయ్య, నకరకంటి కోటేశ్వరరావు, ప్రకాశరావు, సుధాకర్, కనకారావు, షేక్ అజీం, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles