సారపాకను అత్యాధునికంగా సుందరీకరిస్తాం..


Sat,October 5, 2019 01:24 AM

బూర్గంపహాడ్: మండలంలోని సారపాక గ్రామాన్ని అత్యాధునికంగా సుందరీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేష్‌మిశ్రాతో కలిసి ఎమ్మెల్యే సారపాకలోని సుందరయ్యనగర్, గాంధీనగర్, విజయనగర్, భాస్కర్‌నగర్, ఒడియా క్యాంప్, శ్రీరాంపురం తదితర కాలనీలను సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీల్లోని ప్రజలు సమస్యల గురించి సబ్‌కలెక్టర్‌కు, ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ.. సారపాక అభివృద్ధికి జనరల్ ఫండ్ రూ.3కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. రూ.65లక్షలతో ప్రధాన సమస్యలైన డ్రైనేజీలు, సీసీ రోడ్లు, తాగునీరు తదితర సమస్యలను పరిష్కరించేందుకు సబ్‌కలెక్టర్ భవేష్‌మిశ్రా అంగీకారం తెలిపినట్లు వివరించారు. ఎంపీపీ కైపు రోశిరెడ్డి, జడ్‌పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సర్పంచ్‌లు తుపాకుల రామలక్ష్మీ, పుల్లారావు, గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాస్, ఆర్‌ఐ అక్బర్, ఎంపీటీసీ బిక్షపతి, టీఆర్‌ఎస్ నాయకులు గోపిరెడ్డి రమణారెడ్డి, పాండవుల మధు, వీరంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జలగం జగదీష్, బాలి శ్రీహరి, షబీర్‌పాషా, సానికొమ్ము శంకర్‌రెడ్డి, కైపు శ్రీనివాస్‌రెడ్డి, ఝాన్సీలక్ష్మీ, సానికొమ్ము శంకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, దివాకర్‌రెడ్డి, సతీష్, వెంకన్న, సురేష్ పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles