సింగరేణి రైలును పునరుద్ధరించాలి


Sat,October 5, 2019 01:24 AM

కొత్తగూడెం టౌన్: భద్రాచలం రోడ్ కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి బల్లార్షా వరకు వెళ్లే సింగరేణి ప్యాసింజర్ రైలును తిరిగి పునరుద్ధరించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కొత్తగూడెం రైల్వేస్టేషన్‌లో బైఠాయించారు. తొమ్మిది నెలల నుంచి కొత్తగూడెం నుంచి నడిచే సింగరేణి రైలును రైల్వే అధికారులు నిలుపుదల చేసి దాని స్థానంలో పుష్‌పుల్ సర్వీసును నడిపిస్తున్నారని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సింగరేణి రైలు 5వ తేదీ నుంచి నడిపిస్తున్నట్లు ఆశాఖ సర్యూలర్ జారీ చేసింది. తిరిగి సింగరేణిని రద్దు చేసి పుష్‌పుల్ సర్వీసునే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దసరా పండుగకు సింగరేణి ఏరియాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సింగరేణి రైలురాక మరింత వెనక్కిపోయింది.


విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఎంపీపీ సోనా, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి ఉదయాన్నే రైల్వే స్టేషన్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణీకుల సౌకర్యార్ధం రైలు సర్వీసులను నడిపించాలని పట్టుబడుతూ ఎమ్మెల్యే రైల్వే స్టేషన్‌లో రెండు గంటల పాటు బైఠాయించారు. విషయాన్ని రైల్వే అధికారులతో స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేయడంతో కొద్ది రోజుల్లోనే రైలును నడిపించేందుకు వారు అంగీకరించారని ఏవో ఎమ్మెల్యేకు తెలిపారు. స్టేషన్ సూపరింటెండెంట్ యేసోబు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాంనాయక్, టీఆర్‌ఎస్ నాయకులు వనమా రాఘవేందర్‌రావు, రజాక్, గిడ్ల పరంజ్యోతిరావు, తొగరు రాజశేఖర్, జక్కుల సుందర్‌రావు, కనుకుంట్ల కుమార్, కనుకుంట్ల శ్రీనివాస్, వాసు, శ్రీధర్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles