పెద్దమ్మతల్లికి పూజలు చేసిన జడ్పీచైర్మన్


Sat,October 5, 2019 01:23 AM

పాల్వంచ రూరల్ : పెద్దమ్మతల్లి దేవాలయంలో శుక్రవారం అమ్మవారికి జరిగిన పూజల్లో జడ్పీచైర్మన్ కోరం కనకయ్య దంపతులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వా గతం పలికారు. కోరం దంపతులు అమ్మవారికి దర్శించుకుని పూజలు చేశారు. వారికి అర్చకులు ఆశ్వీర్వచనం అందజేసి శేష,వస్త్ర,ప్రసాదాలతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. దసరా ఉత్సవాల ఆరో రోజున కనకదుర్గ అమ్మవారు భక్తులకు శ్రీమహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, ఎంపీపీ మడి సరస్వతి, జగన్నాధపురం సర్పంచ్ అనిత, ఉప సర్పంచ్ వీరభద్రం, ఇతర ప్రముఖులు నందానాయక్, చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ నాయకులు సంతోష్‌గౌడ్, దంతగాని రవి, శ్రీరామమూర్తి తదితరులు ఉన్నారు. ఆలయంలో జరిగిన కార్యక్రమంలో అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles