రామున్ని దర్శించుకున్న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్


Sat,October 5, 2019 01:23 AM

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారిని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (తెలంగాణ) అభిలాష బిస్తా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్దంగా ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ రామాలయంలోని గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆలయ విశిష్టత గురించి వివరించారు. తదుపరి ఆలయ అధికారులు ఆమెకు జ్ఞాపిక అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


విజయలక్ష్మీ అలంకారంలో అమ్మవారు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు శ్రీవిజయలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
నేడు ఐశ్వర్యలక్ష్మీ అలంకారంలో
దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న దసరా నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు నేడు శ్రీవిజయలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles