భద్రాద్రిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషిచేస్తా..


Fri,October 4, 2019 12:28 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ : భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్యసేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతీ వార్డుకు వెళ్లి పరిశీలించారు. ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ చావా యుగంధర్, ఆర్‌ఎంవో టీ ప్రవీణ్‌లతో ఆయన మాట్లాడారు. ఏరియా వైద్యశాలలో ఉన్న సమస్యలు, సిబ్బంది కొరత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యం రోగులకు అందుతుందని తెలిపారు. భద్రాచలం ఏరియా వైద్యశాలలో అత్యున్నతస్థాయిలో సేవలు అందుతున్నాయని వివరించారు. భద్రాద్రి వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరత సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పోస్టులు భర్తీ అయ్యేలా చర్యలు చేపడతామని తెలిపారు. భద్రాద్రిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి ప్రజలకు చేరువలోకి మెరుగైన వైద్యం తెస్తోందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అరికెల్ల తిరుపతిరావు, అధికార ప్రతినిధి రత్నం రమాకాంత్, ఉపాధ్యక్షుడు పడిసిరి శ్రీనివాస్, బంబోతుల రాజీవ్, ఎంపీపీ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles