కొమ్ముగూడెంలో అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ


Fri,October 4, 2019 12:28 AM

-పాల్గొన్న ఎమ్మెల్యే రాములునాయక్
జూలూరుపాడు : మండలపరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలోని పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో గురువారం అభయాంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజా మహోత్సవ కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలనడుమ ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు, దేవాలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, జడ్పీటీసీ భూక్యా కళావతి, గ్రామ సర్పంచ్ బానోత్ శాంతిలాల్, ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు దుద్దుకూరి నర్సింహారావు, చౌడం నర్సింహారావు, మాజీ ఎంపీపీ లాలూనాయక్, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles