ఇసుక ర్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా


Fri,October 4, 2019 12:28 AM

పాల్వంచ రూరల్ : కిన్నెరసాని వాగు పరివాహక ప్రాంతమైన మండలంలోని సోములగూడెంలో గురువారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇసుక ర్యాంపును ప్రారంభించారు. ఆన్‌లైన్‌ద్వార ఇసుకను బుక్ చేసుకుని తీసుకువెళ్లే విధానంలో భాగంగా ర్యాంపులోకి ఇసుక తెచ్చుకునేందుకు వెళ్లే ట్రాక్టరుకు కట్టిన రిబ్బను కత్తిరించి ఇసుక రవాణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సోములగూడెం సర్పంచ్ ముక్తి సక్కుబాయి, మైన్స్ ఏడీఈ గంగాధర్, సతీష్, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, ఎంపీపీ మడి సరస్వతి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మంతపూరి రాజూగౌడ్, మహీపతి రామలింగం, రూరల్ ఎస్సై శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles