ఘనంగా రామయ్య నిత్యకల్యాణం


Fri,October 4, 2019 12:27 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం రామాలయం లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు గోదావరి నది నుంచి తీర్థ్ధబిందెను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. ఆరాధన, అర్చన, సేవాకాలం, నివేదన, పుణ్యఃవచనం తదితర పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థ్దప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియాన్ని సందర్శించి సీతమ్మవారి నగలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్యస్వామికి నిత్యకల్యాణం నిర్వహించారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles